Thursday, 17 September 2026 06:47:00 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఐ.ఎల్.పి.ఏ.లో భారీగా చేరికలు.దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు సభ్యత్వ స్వీకరణ.

Date : 11 August 2026 07:27 PM Views : 108

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA)లో దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు సభ్యత్వం స్వీకరించారు. న్యాయవాదుల సంక్షేమం, న్యాయవాదుల వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, న్యాయవ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ILPA చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై వారు సంఘంలో చేరినట్లు తెలిపారు.దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోంది మురళి మోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్ర బాబు, సీనియర్ న్యాయవాదులు ముప్పిడి శ్యాం సుధాకర్, త్రినేటి సంజయ్, తామా బాలరాజు, కాలం సంధ్యారాణి, వెంకటరమణ తదితరులు ILPAలో సభ్యత్వం స్వీకరించారు.ఈ సందర్భంగా ILPA రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మారపాక రమేష్, మహమ్మద్ సాదిక్ పాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడ్డ సామంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రపాటి కృష్ణ చేతుల మీదుగా నూతన సభ్యులకు సభ్యత్వం అందజేశారు.ఈ సందర్భంగా ILPA రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, వృత్తి గౌరవ పరిరక్షణ, హక్కుల సాధన, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ILPA మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ILPAలో చేరడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు, ILPA రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :