Monday, 03 August 2026 03:51:29 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Date : 09 July 2026 06:51 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయవద్దు.తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను విస్తృతంగా ప్రోత్సహించాలి. జూలై 15 తర్వాత జలాశయాల నీటి నిల్వల ఆధారంగా రైతులకు పంటలపై మార్గదర్శకాలు.మహారాష్ట్ర, కర్ణాటక వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి.సూపర్ ఎల్‌నినోను పంటల వైవిధ్యీకరణకు అవకాశంగా మలుచుకోవాలి.సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సూపర్ ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఐ డి ఓ సి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జూలై 9 నాటికి రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. కృష్ణా బేసిన్‌లో గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, ఇప్పటివరకు ఎగువ రాష్ట్రాల నుంచి ఎలాంటి ప్రవాహం రాలేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో తాగునీటికి మాత్రమే సరిపడా నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ఇప్పటివరకు వరద రాలేదని, వచ్చే వారం రోజులపాటు భారీ వర్షాల అవకాశాలు లేవని భారత వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో ఆగస్టులో మాత్రమే సాధారణానికి సమీపంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షపాతం లోటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే వరదలపైనే కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఆధారపడి ఉందని, ఆ అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదలకు ప్రణాళికలు లేవని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైన మేరకు నీటిని తరలించి చెరువులు, కుంటలు నింపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేయవద్దని స్పష్టమైన సందేశం ఇవ్వాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతు వేదికలు, గ్రామసభలు, ప్యాక్స్‌ల ద్వారా నీటి లభ్యత, వర్షపాతం అంచనాలు, పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి రైతు వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పంటలు సాగు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వాతావరణం, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులు, రైతులకు సమాచారం అందించాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా విత్తనాల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జూలై 15 తర్వాత జలాశయాల్లో నీటి నిల్వలను సమీక్షించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరద పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తే వెంటనే నీటిని ఎత్తిపోసేలా పంపింగ్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచాలని, అప్పటి వరకు అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో పరిస్థితిని ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే దిశగా చూడాలని సూచించారు. జిల్లాల వారీగా నీటి లభ్యతను అంచనా వేసి పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని, ఆయిల్‌పామ్, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకు అనుకూల పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటల సాగును ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే సిద్ధంగా ఉంచి రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న చర్యలను రాష్ట్ర మంత్రులకు వివరించారు. గ్రామసభలు, రైతు వేదికలు, వ్యవసాయ శాఖ ద్వారా ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు ఆలస్యమైన కారణంగా జిల్లాలో వరి, మొక్కజొన్న సాగు ఆశించిన స్థాయిలో జరగలేదని, అదే సమయంలో రైతులు పత్తి, కందులు, పెసర వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగిన పక్షంలో స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటల సాగు, తేమ సంరక్షణ చర్యలు, సకాలంలో విత్తనాల పంపిణీ, రైతులకు సాంకేతిక సూచనలు అందించడం వంటి అంశాలతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలోని నీటి లభ్యత, జలాశయాల పరిస్థితి, ఖరీఫ్ పంటల సాగు పురోగతి, రైతులకు అందించాల్సిన అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :