తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలుగు వెలుగు)జూలూరుపాడులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 29 వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీయార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... తెలుగుజాతి కిరీటం స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి సత్తాని ప్రపంచ వ్యాప్తంగా కనిపించేలా చేసిన మహా నాయకుడు అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను రాజకీయంగా అభివృద్ధి చేసి తన పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేపట్టిన మహా నేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరేం రామయ్య ,తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, అడపా సురేష్, పెంటికల వీరబాబు, కళ్యాణపు రమేష్, కళ్యాణపు ప్రసాదు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ