Thursday, 17 September 2026 10:54:26 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

యువత టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. యువ టూరిజం క్లబ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 18 May 2026 05:56 PM Views : 245

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మే 18 నుండి 23 వరకు నిర్వహించనున్న టూరిజం వారోత్సవాల సందర్భంగా “యువ టూరిజం క్లబ్” పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, యువత టూరిజం రంగంపై అవగాహన పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతలో పర్యాటక ప్రదేశాల పట్ల ఆసక్తి పెంచడంతో పాటు వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. టూరిజం వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మే 19న పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ వద్ద టూరిజం అవేర్‌నెస్ డ్రైవ్, మే 20న లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ధ రాక్ కేవ్స్ వద్ద హెరిటేజ్ వాక్, మే 21న జిల్లాలోని యూట్యూబర్లతో సమావేశం, మే 22న బౌద్ధ రాక్ కేవ్స్ ప్రాంతంలో స్వచ్ఛత డ్రైవ్, మే 23న పాల్వంచలోని ఐడాక్‌లో బ్రాండ్ కిట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు .టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ మ్యూజియాలజీ” మరియు “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ ఆర్కియాలజీ” కోర్సులను యువత వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కోర్సుల ద్వారా పర్యాటక, పురావస్తు, మ్యూజియం రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజును సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9849905722, 9849905723

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :