Wednesday, 04 November 2026 12:59:48 PM
# మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు.

రైతు సదస్సు వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 23 June 2025 07:30 PM Views : 855

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతు భరోసాలో భాగంగా రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా 9000 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ప్రభుత్వం సచివాలయం వద్ద నిర్వహించే రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లాలో ని రైతు వేదికల నుండి రైతులు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతువేదికలలో రైతు సదస్సులు ప్రత్యక్షంగా వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మంగళవారం అన్ని రైతు వేదికలను పండుగ వాతావరణం లో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నాలుగు గంటలకే రైతు వేదిక వద్దకు రైతులు చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆడియో మరియు వీడియోలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సరిచూసుకోవాలన్నారు. రైతు వేదికలకు విచ్చేసే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని అధికారులకు సూచించారు. ప్రతి రైతు వేదికలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు మండల స్థాయిలో ఎంత మంది రైతులకు ఎంత మొత్తంలో రైతు భరోసా జమ అయినదో వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రైతు వేదిక వద్ద పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు వేదికల వద్ద హాజరైన రైతుల వివరాలను నమోదు చేసి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :