తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (అమెరికా) అధ్యక్షులు మొహిందర్ సింగ్ గిల్జియాన్ ను రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. పాల్వంచ మండలం పరిధి సీతానగర్ కాలనీలోని శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి ఆహ్వానం మేరకు శుక్రవారం రాత్రి పాల్వంచకు వచ్చిన మొహిందర్ సింగ్ ను కొత్వాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువా, బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్వాల తోపాటు పెద్దమ్మతల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు Y వెంకటేశ్వర్లు, పైడిపల్లి మహేష్, కాపర్తి వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ