Tuesday, 03 November 2026 07:47:33 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

Date : 29 October 2026 04:20 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశాభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లాస్థాయి విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యువత తమ ఆలోచనలు,అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరిచేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుంది. యువతలో పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తేదీ: 31 అక్టోబర్ 2026. సమయం: 09:30 గంటలకు వేదిక: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నందు "వన్ నేషన్ - వన్ ఎలక్షన్" అనే అంశంపై 3 నిమిషాలు మాట్లాడే సమయం.18 నుండి 25 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొనే అవకాశం కలదు. ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా యువ అధికారి మద్దుల వెంకట రాంబాబు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :