Saturday, 19 September 2026 06:02:53 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి : జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్.

Date : 20 January 2026 07:27 PM Views : 238

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగబోయే మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ అన్నారు. ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ఆర్‌ఓలు , ఏఆర్‌ఓలు కు మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె. శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల విధులు, బాధ్యతలను విస్తృతంగా వివరించారు. నోటీసుల జారీ నుంచి ప్రారంభించి నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన , పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం, ఎన్నికల గుర్తుల కేటాయింపు విధానం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్ స్టేషన్ల పరిశీలన, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.ఎన్నికల నిర్వహణలో పూర్తి అవగాహన కలిగి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులు సూచించారు.మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఉపయోగించే ఫారాలపై, ముఖ్యంగా నామినేషన్ ఫారాల భర్తీ విధానం, జాగ్రత్తలు తదితర అంశాలను ట్రైనింగ్ అడిషనల్ నోడల్ అధికారి పి. సాయి కృష్ణ వివరించారు. అలాగే, గత ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాలు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎంపీడీవో శ్రీనివాస్ వివరించారు.శిక్షణలో ప్రత్యేకంగా, బ్యాలెట్ పేపర్లు మరియు పోలింగ్ బాక్స్‌ల ద్వారా నిర్వహించే పురపాలక ఎన్నికల సమయంలో ప్రిసైడింగ్ అధికారులు తమ విధుల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, వార్డుల వారీ పోలింగ్ కేంద్రాలను సమగ్రంగా పర్యవేక్షించి ఎన్నికల ప్రతి దశను నియమాలకు అనుగుణంగా నిర్వహించవలసిన విధానాన్ని అధికారులు హైలైట్ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, పాటు సుమారు 200 మంది ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :