Wednesday, 16 September 2026 05:23:58 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కాలేజీ తరలింపు కుట్రకు స్వస్తి చెప్పండి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్.

Date : 18 August 2026 06:32 PM Views : 97

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాలేజీ తరలింపు కుట్రకు స్వస్తి చెప్పండి.జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తే ఉద్యమం తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్.కళాశాల తరలింపు నిలిపివేయాలని కలెక్టర్'కు ఏఐఎస్ఎఫ్ వినతిపత్రం.జిల్లాకు మంజూరైన బీసీ సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. గురుకుల డిగ్రీ కళాశాల తరలింపును అడ్డుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్'కు వినతిపత్రం అందజేసి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2023లో భద్రాద్రి జిల్లా కేంద్రానికి మంజూరైన బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను నిబంధనలకు విరుద్ధంగా అన్నపురెడ్డిపల్లిలోని శిథిలావస్థకు చేరిన పాత సత్రం భవనంలో ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. ప్రస్తుతం కొందరు స్వార్థపూరిత శక్తులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ కళాశాలను మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు తరలించేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రస్తుత విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ప్రవేశాలను ఉద్దేశపూర్వకంగా రద్దు చేస్తూ, ఉన్న విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపే యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగూడెం రామవరంలోని నేతాజీ పాఠశాలలో 500 మందికి సరిపడా విశాలమైన ప్రభుత్వ భవనం అందుబాటులో ఉందని, తక్షణమే అక్కడికి తరలించి రెగ్యులర్ తరగతులు నడపాలని కోరారు. జిల్లా విద్యార్థుల హక్కులను కాలరాస్తూ విద్యాసంస్థను తరలించాలని చూస్తే విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోదని, తల్లిదండ్రులను కలుపుకుని జిల్లావ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం సమర్పించినవారిలో నాయకులు మర్మం ఉమా మహేష్, కళ్యాణ్ రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :