Thursday, 02 July 2026 04:24:35 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

Date : 24 June 2026 08:16 PM Views : 122

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ధార్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, సమాజంలో శాంతి. ధార్మిక కార్యక్రమాలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పరిధిలోని సాయిబాబా దేవాలయం 16వ వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. అక్కడ జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను తిలకించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి దైవచింతన ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం వంటి గొప్ప సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకుని ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ గుర్తించి పేదలను ఆదుకోవడానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, పరుచూరి కృష్ణ మోహన్, రాంబాబు, నాగేశ్వర్ రావు, వాసిరెడ్డి ప్రసాద్, ఏపూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :