Monday, 03 August 2026 04:59:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వ్యక్తిపై హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన కొత్తగూడెం 1టౌన్ పోలీసులు.

Date : 07 March 2026 08:19 PM Views : 1252

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నెహ్రూ బస్తి రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) సంవత్సరాలు అను వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.రైలు పట్టాల వద్ద ఉన్న కిరాణా దుకాణం వద్ద స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న నరేష్ పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ, సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు @ ఐలయ్య లు దాడి చేశారు.రోకలి బండతో నరేష్ తలపై గట్టిగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.తలకు పలుచోట్ల గాయాలు కావడంతో స్పృహ కోల్పోయి ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు.వైద్యం నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి నరేష్ ను తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న నరేష్ పరిస్థితి విషమంగా ఉంది.నెహ్రూ బస్తీ ఏరియాలో నిర్మల అనే మహిళకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని ఐలయ్య కొన్ని నెలల క్రితం ఆక్రమించాడు.అతని వద్ద నిర్మల 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆమెకు అనారోగ్యం కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లడంతో అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో గత 18 నెలల నుండి ఆ ఇంట్లో ఐలయ్య కుటుంబంతో ఉంటున్నాడు.అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా, ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టాడు.ఈ విషయంలో నిర్మలకు నరేష్ సపోర్ట్ చేశాడని కక్ష పెంచుకొని ఉద్దేశపూర్వకంగా నరేష్ పై దాడి చేసిన పైన పేర్కొన్న ఐదుగురు నిందితులను శనివారం 1టౌన్ పోలీసులు అరెస్టు చేసి,వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగిందని కొత్తగూడెం 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ వివరాలను వెల్లడించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :