తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 14వ తేదీన కొత్తగూడెం క్లబ్ లో జరగనున్న జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్,పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు షామియుద్దీన్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు.కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజును ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఎస్పీకి పోటీల గురించి వివరించి పోటీల ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని అందులో భాగంగా జిల్లాలో క్రీడలు,క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో జిల్లా స్థాయి ఎంకరేజ్మెంట్ బెంచ్ ప్రెస్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జెల్లారాజేష్,కెడం లారెన్స్ లు ఎస్పీ ని కలిసిన వారిలో ఉన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ