Thursday, 17 September 2026 05:10:11 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెం విమానాశ్రయ కలకు రెక్కలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి తుమ్మల భేటీ..

Date : 01 September 2026 05:37 PM Views : 550

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : •సెప్టెంబరు 7న క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాంకేతిక బృందం •నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలపై లోతైన అధ్యయనం •నివేదిక అనుకూలిస్తే తక్షణణమే తదుపరి చర్యలు •కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూసేకరణ తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను, విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాకు కలిగే రవాణా, పారిశ్రామిక, పర్యాటక ప్రయోజనాలను కేంద్ర మంత్రికి వివరించారు. గత అడ్డంకులు.. కొత్త ఆశలు.. గతంలో గుర్తించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలడంతో, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొత్తగా నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రాంతాల్లో భూసేకరణ సౌలభ్యం, రన్‌వే నిర్మాణానికి అనువైన భూభాగం, వాతావరణ పరిస్థితులు వంటి కీలక అంశాలను నిపుణుల బృందం నిశితంగా అధ్యయనం చేయనుంది. ఢిల్లీ వేదికగా కీలక భేటీ.. ఈ పరిణామాలపై మంగళవారం న్యూఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి సవివరంగా తీసుకెళ్లారు. జిల్లా అభివృద్ధిలో విమానాశ్రయం పోషించే పాత్రను, స్థానికుల రవాణా అవసరాలను మంత్రి తుమ్మల వివరించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన వెంటనే విమానాశ్రయం ఏర్పాటుకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. మైత్రి పునాదిగా విజ్ఞప్తి.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో తనకున్న చిరకాల మైత్రిని కూడా మంత్రి తుమ్మల గుర్తుచేశారు. రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత నేత ఎర్రన్నాయుడుతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, అలాగే జిల్లా ప్రజలకు విమానాశ్రయం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రికి సవివరంగా వివరించారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరో రెండు ప్రతిపాదనలపైనా కదలిక.. రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయ ప్రతిపాదనలపైనా కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల అంశంపై సెప్టెంబరు 2న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీన్నిబట్టి రాష్ట్రవ్యాప్తంగా విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక సానుకూలంగా వస్తే.. భద్రాద్రి కొత్తగూడెం గగనతలంలో విమానం రెక్కలు విప్పే రోజు ఎంతో దూరంలో లేదన్న ఆశాభావం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :