Wednesday, 16 September 2026 10:09:10 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 30 October 2025 05:23 PM Views : 369

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు పంట రక్షణ, సమీకృత వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచనలు టేకులపల్లి మండలంలోని తంగిళ్ళ తండా గ్రామంలో బుధవారం తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి మరియు పత్తి పంటలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రత్యక్షంగా సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు గాంధీకి చెందిన వరి పొలాన్ని సందర్శించి పంట పరిస్థితిని సమీక్షించారు. పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల పంట మరింత నష్టానికి గురయ్యే అవకాశం ఉన్నందున వెంటనే నీటి నిల్వను తొలగించి, వరి కోతను త్వరితగతిన చేపట్టాలని రైతులకు సూచించారు. పంట నష్టాన్ని తగ్గించుకోవడమే కాకుండా రైతుల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా చూడటం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ పత్తి సాగు చేస్తున్న రైతులు పత్తి అనంతరం మునగ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. మునగ సాగు చేయడం ద్వారా ఇప్పటికే జిల్లాలో చాలామంది రైతులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని మునగ సాగు ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని సూచించారు. అదేవిధంగా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా బోరు సౌకర్యం ఉన్న వారు, సగం భూమిలో ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ రైతులకు సమీకృత వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వ్యవసాయం పట్ల సృజనాత్మక దృష్టితో ముందుకు సాగుతూ, పంటలతో పాటు కౌజు పిట్టల పెంపకం, మేకల పెంపకం, గేదెల పెంపకం, చేపల పెంపకం, కూరగాయల సాగు వంటి అనుబంధ జీవనోపాధులను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం విస్తృతమవుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యవసాయం స్థిరంగా నిలవడమే కాకుండా రైతుల ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందని ఆయన వివరించారు. పంట రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతోపాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు జరుగుతుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రతి రైతు సమస్యకు త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఏ డి ఏ లాల్ చంద్, వ్యవసాయ శాఖ అధికారి అన్నపూర్ణ మరియు సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :