తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం ప్రగతి మైదాన్ లో ఉమ్మడి జిల్లా బాక్సింగ్ సెలక్షన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ స్టూడెంట్స్ ఏడు బంగారు పతకాలు సాధించారు ఆర్ గణేష్ 33, 35 కేజీ లో బంగారు పతకం అర్హన్ అలీ 43, 46 కేజీ లో బంగారు పతకం కే జస్విత్ రావు 46, 49 కేజీల బంగారు పతకం వి సాయికిరణ్ 49, 52 కేజీ లో బంగారు పతకం కె అరుణ్ కృష్ణ 55 ,58 కేజీలు బంగారు పతకం కే మదన్ 62 ,64 కేజీ లో బంగారు పతకం కే సోహిత్ చంద్ర 70 ప్లస్ కేజీ విభాగంలో బంగారు పతకం గెలుపొందారు. ఈ క్రీడాకారులని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కోరం కనకయ్య ఎమ్మెల్యే ఇల్లందు, జిల్లా బాక్సింగ్ సెక్రటరీ మట్టపర్తి రమేష్, కోచ్ ఆర్. శ్రీనివాస్ మరియు డివైఎస్ఓ ఎం. పరంధామ రెడ్డి అభినందించారు. ఈ క్రీడాకారులందరూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే రాష్ట్ర బాక్సింగ్ టోర్నమెంట్ షేక్ పేట లో జరిగే పోటీలలో పాల్గొంటున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ