తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలి.ప్రతిరోజు 20 మందికి కుష్టు వ్యాధి సర్వే చేయాలి.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్.మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ లో వారు పనిచేసే గ్రామాలలో ప్రతిరోజు ఉదయమే 20 ఇండ్లను సందర్శించి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మలేరియా టీవీ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన ప్రతిపాదనలు డిఎంహెచ్ఓ కార్యాలయానికి పంపించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ అన్నారు. శనివారం నాడు పాల్వంచలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లతో గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణ గురించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా పరీక్షలు జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా RDT లేదా మైక్రోస్కోపీ ద్వారా మలేరియా పరీక్షలు నిర్వహించాలని సూచించారుప్రస్తుత నెలకు సంబంధించిన అన్ని రోగనిరోధక టీకాల కార్యక్రమాలను 100% పూర్తి చేయాలని, మీజిల్స్–రుబెల్లా (MR) టీకాల కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, టీకాలు తీసుకోకుండా మిగిలిపోయిన పిల్లలు, మధ్యలో టీకాలు ఆపివేసిన పిల్లలను గుర్తించి, వారికి టీకాలు అందేలా చూడాలని అన్నారు.కుష్ఠు వ్యాధి సర్వేలు మరియు క్షయవ్యాధి (TB) ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగాg) TB అనుమానిత కేసులకు సీరమ్ నమూనా సేకరణ, ఎక్స్‌రే పరీక్షలు మరియు CBNAAT పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలో పూర్తిస్థాయిలో సిబ్బందికి వివరించారు.ఎం పి హెచ్ ఎ లు వారి పరిధిలోని గ్రామాలకు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే ముందు ఆరోగ్య కార్యక్రమాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తమ పరిధిలో ప్రజలకు సమర్థవంతమైన ఆరోగ్య అవగాహన కల్పించాలని అన్నారు. భారత ప్రభుత్వం 2030 నాటికి TB వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, ఆరోగ్య సిబ్బంది తమకు కేటాయించిన ప్రజలకు తప్పనిసరిగా TBపై అవగాహన మరియు ఆరోగ్య విద్య అందించాలని, కుష్ఠు వ్యాధి సర్వేకు సంబంధించిన సూచనలను కూడా తప్పనిసరిగా పాటించాలని, కుష్ఠు వ్యాధి సర్వేకు సంబంధించిన సూచనలుMPHA (Male) సిబ్బంది అందరూ ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి 9:00 గంటల మధ్య కనీసం 20 ఇళ్లను సందర్శించి, ఇంటింటి కుష్ఠు వ్యాధి సర్వే నిర్వహించి సర్వే నివేదికలను క్రమం తప్పకుండా DMHO కార్యాలయానికి సమర్పించాలని ఆయన అన్నారు. ప్రపంచ పోలియో దినోత్సవం – 24 అక్టోబర్ 2026ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా పోలియో వ్యాధి ప్రాముఖ్యత, పల్స్ పోలియో టీకాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.సమాజానికి ఆరోగ్య విద్య అందించాలి. పై సూచనలన్నింటినీ సిబ్బంది తప్పనిసరిగా, కచ్చితంగా పాటించి, తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిటిసిఓ డాక్టర్ ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్వో శ్రీధర్, పి ఓ డి టి డాక్టర్ రాందాస్, ఏ ఎం ఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ