Wednesday, 04 November 2026 09:21:07 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 02 March 2026 05:51 PM Views : 327

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా సోమవారం ఐడీఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని అన్నారు.దుద్దిళ్ల శ్రీపాదరావు 02 మార్చి 1935న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, మంథనిలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, బి.ఎస్‌సి., ఆర్ట్స్ మరియు లా విద్యలను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు.తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడైన ఆయన ధన్వాడ గ్రామ సర్పంచ్‌గా పలు మార్లు సేవలందించారు. 1980లలో మరియు 1990ల ప్రారంభంలో మంథని నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని పొందారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి విశిష్ట సేవలందించారు.స్పీకర్‌గా ఆయన నిష్పాక్షికత, క్రమశిక్షణ, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావంతో సభా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా గౌరవం పొందిన నాయకుడిగా గుర్తింపు పొందారు. సభ గౌరవాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.గ్రామాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి విశేషమైనదని, సరళత, సమగ్రత, నిబద్ధత ఆయన వ్యక్తిత్వ లక్షణాలుగా నిలిచాయని కలెక్టర్ తెలిపారు.1999 ఏప్రిల్ 13న కరీంనగర్ జిల్లా అన్నారం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో చూపిన అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్ అంకిత్ తెలిపారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :