తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో అమలు జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో మంజూరైన ఇళ్ల సంఖ్య, ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయిన ఇళ్ల వివరాలు, స్లాబ్ లెవల్‌కు చేరుకున్న ఇళ్ల స్థితి, ఇంకా నిర్మాణం ప్రారంభం కాని లేదా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రౌండింగ్ పూర్తైన ఇళ్లను త్వరితగతిన తదుపరి దశలకు తీసుకెళ్లి స్లాబ్ లెవల్ వరకు పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై కూడా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యమని, అందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు .సమాసంలో హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ ఏఈలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ