Thursday, 17 September 2026 01:34:25 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

10 వ వార్డు ఓపెన్ జిమ్ శ్రమదానం లో నేను సైతం అన్న కమీషనర్

Date : 09 August 2024 05:21 PM Views : 744

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫోటోలకు ఫోజు కాకుండా నేను సైతం అంటూ అరగంట పాటు స్వయంగా మాతోపాటు పెద్ద పెద్ద పిచ్చి మొక్కలను గట్టిగా లాగి తొలగించడంలో అభినందనీయమని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ కొనియాడారు .శుక్రవారం లక్ష్మీ టాకీస్ ఏరియా ఓపెన్ జిమ్ లో జరుగుతున్న శ్రమదానం లో భాగంగా కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి అక్కడికి విచ్చేసి ,వచ్చామా, పోయామా, ఒక ఫోటో కు పోజు ఇచ్చామా అని కాకుండా మాతో పాటుగా పాల్గొని సుమారు అర్థగంట పాటు మొక్కలను తొలగించడం జరిగిందని ఆమె అన్నారు .సింగరేణి కాలీ స్థలాల్లో పెన్షన్ తీగేసిన స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి నివాస ఇళ్లలోకి పాములు, తేలు విషపురుగులు వస్తున్నాయని ,ఆ ప్రాంతంలోని ఖాళీ స్థలాన్ని కమీషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. స్పందించిన కమిషనర్ సింగరేణి అధికారులకు మున్సిపాలిటీ ద్వారా లెటర్ పెట్టి ఆయా ప్రాంతాల్లోనూ పిచ్చి మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు .

వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కమీషనర్ మరియు కౌన్సిలర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సబ్ జైల్ ప్రాంతంలో పెంచిన కోటి వృక్షార్జన ప్రాంతాన్ని కమిషనర్ సందర్శించి కార్మిక వాడల్లో కాలుష్య నివారణ కోసం స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రజలకు ఇచ్చేందుకు ఈ కోటి వృక్షాలు ఉపయోగపడుతుందని కోటి వృక్షాల్లో చెట్లను ఇంత పెద్దగా పెంచడం అభినందనీయమని కమిషనర్ కౌన్సిలర్ ని కొనియాడారు .వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటుగా సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్ ,,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, నాయకులు మునిగదప వెంకటేశ్వర్లు,, అజరయ్య ,జహీర్, వెంకటలక్ష్మి ,శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :