తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలని కొత్తగూడెం అర్బన్ సీడీపీవో పద్మశ్రీ అన్నారు. కొత్తగూడెం కేంద్రం లోని కూలీలైన్ - 1 అంగన్వాడీ కేంద్రం లో శుక్రవారం జరిగిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం లో భాగంగా ఆమె అన్నారు. తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలని సీడీపీవో పద్మశ్రీ అన్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవపదార్థాలు బిడ్డకు తాగించకూడదని ఆమె అన్నారు. బిడ్డకు పాలివ్వడం వలన తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని వారు అన్నారు. అదేవిధంగా తల్లికి రొమ్ము క్యాన్సర్ లాంటివి రావని ఆమె సూచించారు. ఈయొక్క కార్యక్రమానికి సూపర్వైజర్ శారదా, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, గిరి లక్ష్మీ, ఎండి జరీనా, రాజేశ్వరి, గర్భిణులు, బాలింతలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారూ.
Admin
తెలుగు వెలుగు టీవీ