తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. తదనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జీవీకే మనోహర్ ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం ప్రభుత్వ హాస్పటల్ నందు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని 140 కోట్ల భారతీయులకు రక్షణ కవచం ఎల్లవేళలా ఈ దేశ బావి భవిష్యత్తు గల యువకుల గురించి,మహిళల గురించి, ఈ దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రజలందరి గురించి ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అని వారు ఇంకా అనేక సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటూ ఈ దేశానికి సేవలందించాలని అన్నారు. మాజీ జిల్లా అధ్యక్షుడు జీవీకే మనోహర్ రావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నది అంటే అది కేవలం నరేంద్ర మోడీ పరిపాలన దక్షతను చూసే ఈ ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ ప్రపంచంలోనే అగ్ర నాయకుడిగా ఉంటూ ఈ దేశాన్ని సురక్షితంగా కాపాడే సైనికుడు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కొనియాడారు ఒక వ్యక్తి శక్తిగా ఎదగడం ఎలా ఉంటుంది అన్నది నరేంద్ర మోడీ జీవితం ఆదర్శమని ఈ విధంగా భారత దేశ యువత అకుంఠిత దీక్షతో వారు అనుకున్నా లక్ష్యాలను నెరవేర్చాలంటే నరేంద్ర మోడీ 75 సంవత్సరాల జీవిత కాలం ఒక ఉదాహరణ అని యువకులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్,చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్, నియోజకవర్గ కన్వీనర్ నరేంద్రబాబు,జిల్లా నాయకులు యమునూరి శివ క్రిష్ణ,జల్లారపు శ్రీనివాస్,మహిళా నాయకురాలు భూక్యా పూర్ణ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎండి సలీం, కొత్తగూడెం పట్టణ కన్వీనర్ ద్వారా రమేష్, కో కన్వీనర్ కనకం నవీన్, బానోత్ రాంబాబు నాయక్, యువ మోర్చా సిహెచ్ నరేష్, మహిళా మోర్చా మాదాసు పద్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ