తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాతకొత్తగూడెంకు చెందిన సీనియర్ కార్యకర్త బి. సురేష్ బాబు మృతి పార్టీకి తీరని లోటు అని, ఆయన ఆశయ సాధనే మనందరికీ లక్ష్యం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సురేష్ బాబు మృతి చెందిన విషయం తెలుసుకున్న సాబీర్ పాషా, వారి నివాసానికి చేరుకుని మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురేష్ బాబు తన జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారని, నిరంతరం బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారని కొనియాడారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆయన సేవలు చిరస్మరణీయమని, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, పడాల భవాని ప్రసాద్, రజని బాబు, రవి వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ