తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 500 మార్కుల కంటే పైన సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించి తల్లిదండ్రులను మరియు విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారు ఏ విధంగా కష్టపడి చదివి విజయం సాధించినారు వారి యొక్క అనుభవాలను ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు చెప్పటం జరిగింది తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏవిధంగా కష్టపడ్డారు మంచి క్రమశిక్షణలో విద్యాబోధనను నేర్పించారని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కొనియాడారు విద్యార్థులకు తల్లిదండ్రులు మాకు చాలా ఆనందంగానూ ఎంతో గర్వంగాను మా పిల్లలతోటి మమ్మల్ని కూడా సన్మానించడం చాలా హర్షించదగ్గ విషయంగా భావించారు జీవితంలో ఇది ఒక మర్చిపోలేని వంటి సంఘటనగా వారు భావించారు మరి ఈ ఆత్మీయ అభినందన సభలో ప్రధానోపాధ్యాయులు తప్పేట లక్ష్మీనరసయ్య మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాస్,నిమ్మగడ్డ ఉమా,సురపనేని శాంతకుమారి పి కుమార్ మహేశ్వరి మేడం పి రామనాథం,జివిఆర్ ప్రసాద్,జి వెంకటేశ్వర్లు,బోడ కృష్ణ,బి సునీత,వి శకుంతల,పిడి అరుణ,సన్మాన గ్రహీతలైనటువంటి చొప్పకట్ల చంద్రశేఖర్ శర్మ, నండ్రు గురుమూర్తి, భూక్య శ్రీను, తాటి వెంకటేశ్వర్ల,అది విద్యార్థిని విద్యార్థులు చెప్పకట్ల హరిందరనాద్ వాద్యయ్య నండ్రు నిశాంత్ తాటి రామ్ చరణ్ పాముల శరణ్య ముఖ్య దేవేందర్ మరియు నాగ రమేష్,తలపు రెడ్డి ప్రతాపరెడ్డి, జిల్లా జిల్లా ఉపేంద్రమ్మ భూక్య దేవేందర్ పాల్గొని ఈ సభను విజయవంతం చేసినారు
Admin
తెలుగు వెలుగు టీవీ