తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా సమీకృత కార్యాలయం ప్రజావాణి కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ అందించడం జరిగింది. దివ్యాంగుల సహాయ ఉపకరణాలు కొరకు టీజీఓబిఎంఎంఎస్ వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపిక అయిన బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామ దివ్యాంగుడు అయినటువంటి చిలకాల నరేష్ కి అందించుట జరిగింది. కార్యక్రమములో డి. వేణు గోపాల్, అదనపు జిల్లా కలెక్టరు మరియు జె.ఎమ్. స్వర్ణలతా లేనినా, జిల్లా సంక్షేమ అధికారిణి, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ