Tuesday, 03 November 2026 11:33:11 PM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

త్వరలో కొత్తగూడెంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం.కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 23 August 2026 05:59 PM Views : 309

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో కొత్తగూడెంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం.ప్రజలకు తీరనున్న పాస్‌పోర్ట్ కష్టాలు. కొత్తగూడెం హెడ్ పోస్టాఫీసులో ఏర్పాటుకు చర్యలు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని హెడ్ పోస్టాఫీసులో త్వరలోనే పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పిఓపిఎస్కే) ఏర్పాటు కానుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెంలో పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయాలని తాను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి సమర్పించిన లేఖలు, సంప్రదింపులపై అధికారులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అనుమతితో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీఎస్‌పీ డివిజన్ అండర్ సెక్రటరీకి పరిశీలన నిమిత్తం ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. కొత్తగూడెం ప్రధాన పారిశ్రామిక, గనుల, వాణిజ్య కేంద్రంగా విస్తరించి ఉందని, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవల కోసం 75 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం, మహబూబాబాద్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని గుర్తుచేశారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు సమయం, డబ్బు వృథా చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగూడెం ప్రత్యేక జిల్లా కేంద్రంగా మారినందున ఇక్కడే పూర్తిస్థాయి కేంద్రం అవసరమని స్పష్టం చేశారు. ఈ సమస్యను కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు సాధించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే కేంద్రం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి రానుందని కొనున్నాయి కూనంనేని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :