తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రేమ, సోదర భావం, ధర్మచింతన కలిగి ఉంటాయని, అవి ప్రతి మానవునిలోనూ ఉండాలని అన్నారు. దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రవక్త అని, సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతివైపు నడిపించిన ఆయన జన్మదినమే మిలాద్-ఉన్ -నబీ అని వ్యాఖ్యానించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మైనారిటీ నాయకులు నయీమ్ ఖురేషి,మహమ్మద్ ఖాన్,సీఐలు శివప్రసాద్, కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ - సిపిఐ పార్టీ నాయకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ