Wednesday, 16 September 2026 12:36:35 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Date : 26 April 2025 04:59 PM Views : 954

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండ్లకు తాళాలు వేసి దూర ప్రయాణాలు చేసేవారు పోలీస్ వారికి సమాచారం అందించండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వేసవి కాలం సెలవులు ప్రారంభంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.వేసవి సెలవుల దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని,ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నామన్నారు.ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అయన పలు సూచనలు చేశారు.దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా,ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి.దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇండ్ల పరిసర ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మంచిదన్నారు.విలువైన వస్తువుల సమాచారాన్ని,వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం.లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లాలి.బ్యాగుల్లో బంగారు నగలు,డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద,కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 నకు ఫోన్ చేసి సమాచారం అందించాలి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :