Wednesday, 16 September 2026 03:22:49 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రాజెక్టు మహాసభ లో మాట్లాడుతున్న రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ch సీతా మహాలక్ష్మి

Date : 22 June 2026 04:44 PM Views : 197

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (AITUC) మహాసభ కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభలో AITUC రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సీహెచ్. సీతా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ (SIR) పేరుతో అంగన్వాడీ టీచర్లకు బీఎల్‌ఓ విధులు అప్పగించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు మూతపడటంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన పోషకాహారం, సేవలు నిలిచిపోతున్నాయని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లపై అదనపు పనిభారం మోపకుండా బీఎల్‌ఓ విధులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.18,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు గోనే మణి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ మహాసభలో జిల్లా నాయకులు నేరళ్ల రమేష్, జక్కుల రాములు, కృష్ణవేణి, కమల, సరోజ, జానకి, కృపమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేసినవారు: నరాటి ప్రసాద్, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :