Friday, 18 September 2026 04:23:00 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఫ్లెక్సీలను తొలగించండి పర్యావరణాన్ని కాపాడండి

Date : 30 March 2026 03:15 PM Views : 324

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కొత్తగూడెం కలెక్టరేట్: కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు జాతీయ ప్రధాన రహదారుల సెంటర్ పోల్స్ కు అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణం అవుతున్న ఫ్లెక్సీ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని,విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మూలంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా వారి చర్యలు ఉన్నాయన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో ఏ విధమైన అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేసినా సంబంధిత మున్సిపల్ మరియు పంచాయితీ సిబ్బంది చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఏ విధమైన అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సదరు ప్లెక్సీ ప్రింటింగ్ యజమానులపై చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని కోరారు.గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుదీప్ జిల్లా అంతటా ఫ్లెక్సీ హోర్డింగ్ లను తొలగించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.తక్షణమే స్పందించి కొత్తగూడెం కార్పొరేషన్ మరియు జిల్లాలోని వివిధ మండలాలలో పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్లాస్టిక్ తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,కొండా విజయభాస్కర్,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :