Tuesday, 03 November 2026 12:30:37 PM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి 3వ టౌన్ సీఐ శివప్రసాద్

Date : 25 August 2025 07:37 PM Views : 527

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని పట్టణ 3వ టౌన్ సిఐ కె. శివప్రసాద్ అన్నారు.పట్టణంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు,కోచ్ షమీఉద్దీన్ జిమ్ ప్రారంభించి 10వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివప్రసాద్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంధర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని,ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా,ఆరోగ్యంగా ఉంటారన్నారు.మనం ఏదైతే లక్ష్యం నిర్దేశించుకుంటామో దాని ఫలితం కోసం మనమే కష్టపడాలని ప్రతీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం 365 రోజులు నిరంతరం సాధన చేయాలని, సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదన్నారు.గతంతో పోల్చుకుంటే క్రీడాకారులకు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయని తద్వారా క్రీడాకారులు ఎక్కువ సాధన చేసి రాష్ట్ర స్థాయిలో,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు వచ్చేలా కృషి చేయాలన్నారు.షమీఉద్దీన్ కోచ్ ఎన్నో ఏళ్ళుగా తన శిక్షణలో వందలాది మంది యువతీ,యువకులను రాష్ట్ర,జాతీయ బాడీ బిల్డింగ్,పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, వై.శివసుబ్రమణ్యం,న్యాయవాది గోపికృష్ణ,మాలోత్ రాజా,ధారా నగేశ్,ఎలక్ట్రికల్ ఏడి రవి,ధర్మేందర్,లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :