తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయని షి టీం ఎస్‌ఐ రమాదేవి అన్నారు. గురువారం కొత్తగూడెం పోస్ట్‌ఆఫీస్ సెంటర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ రమాదేవి మాట్లాడుతూ ఉద్యోగం కేవలం డబ్బు సంపాదించేందుకు మాత్రమే కాకుండా వ్యక్తికి ఆర్థిక స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసాన్ని కల్పించే సాధనమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని సూచించారు.చిన్నచిన్న గొడవలు, అనవసరమైన కేసులకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. చిన్నపాటి కేసులు కూడా భవిష్యత్తులో ఉద్యోగాల ఎంపిక, పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మహిళలు, పిల్లల రక్షణకు ‘పోలీస్ అక్క’జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళలకు అందుబాటులో ఉండేలా మహిళా పోలీస్ అధికారిని నియమించినట్లు చెప్పారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.అత్యవసర వేళ 112కు సమాచారం.మహిళల రక్షణతో పాటు ఫైర్ సర్వీసులు, వైద్య సహాయం, విపత్తుల సమయంలో అత్యవసర సేవలు పొందేందుకు 112 నంబర్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రయాణ సమయంలో కూడా భద్రత కోసం అందుబాటులో ఉన్న సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో she team ASI Nagaiah, PC Rambabu,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ