Sunday, 02 August 2026 04:55:10 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు .

Date : 23 July 2026 06:16 PM Views : 77

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై గణుగపాడులో రైతులకు అవగాహన .ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండి, నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. గురువారం చెండ్రుగొండ మండలం గణుగపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ)తో కలిసి నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్-నినో ప్రభావం వ్యవసాయంపై చూపే ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలు, పంటల వైవిధ్యీకరణ ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించారు.బోరు బావులపై ఆధారపడి వరి సాగు చేయడం వల్ల నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో పాటు పంట నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆయిల్ పామ్, అపరాలు (పప్పుధాన్యాలు), కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించవచ్చని సూచించారు.వ్యవసాయంలో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని, శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలని, వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలు, సలహాలను పాటించాలని రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా నష్టాలను నివారించడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలు, సందేహాలను తెలుసుకుని తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :