Wednesday, 16 September 2026 04:19:13 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఇంటర్, పదోతరగతి ఫెయిల్ విద్యార్థులకు ప్రత్యేక సప్లమెంటరీ క్యాంపులు – 100% ఉత్తీర్ణత లక్ష్యం: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 May 2026 07:52 PM Views : 309

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ఇంటర్మీడియట్, పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపులు, పాఠశాలల మౌలిక సదుపాయాలు, అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారీగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను సేకరించి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రాచలం, పాల్వంచ, చంద్రుగొండలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని సమీక్షించి, ప్రతి విద్యార్థి ఈ క్యాంపులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మే 13 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ తరగతుల ద్వారా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రతి విద్యార్థి హాజరు మరియు అభ్యాస పురోగతిపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కూడా సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని, మండలాలు మరియు పాఠశాలల వారీగా ఫెయిల్ విద్యార్థుల వివరాలతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల లోపాలను గుర్తించి, లక్ష్యబద్ధంగా బోధన చేపట్టి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలోని పాఠశాలల్లో వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతులు 100 శాతం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 12 నుండి విద్యాశాఖ ద్వారా చేపట్టబడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో అధికారులు తమ మండలాల్లో చేపడుతున్న చర్యలపై వివరాలు తెలియజేయగా, కలెక్టర్ తగిన సూచనలు చేశారు. జిల్లాలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :