Thursday, 17 September 2026 04:24:32 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 February 2026 06:50 PM Views : 173

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 07, 08 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో నియమితులైన అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది మరియు సహాయక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటం వలన పోలింగ్ రోజున తమ స్వంత పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయలేని సిబ్బంది ప్రజాస్వామ్య హక్కును కోల్పోకుండా ఉండేందుకు, Conduct of Elections Rules, 1961 లోని రూల్ 27A, రూల్ 28 మరియు Representation of the People Act, 1951 లోని సెక్షన్ 60 ప్రకారం ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ మేరకు అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎన్నికల సిబ్బంది కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాలలో, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయంలో, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు కలిగిన వారు అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ నెల 07 మరియు 08 తేదీల్లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో నియమితులైన అన్ని శ్రేణుల అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల నిఘా బృందాలు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది తదితరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఎన్నికల విధుల ఉత్తర్వు ప్రతిలిపి, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు (EPIC) మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.ఫెసిలిటేషన్ సెంటర్లలో అవసరమైన పత్రాల ధృవీకరణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ పేపర్ జారీ చేయబడుతుందని, నిర్ణీత విధానంలో గోప్యంగా ఓటు వినియోగించి, సీల్ చేసిన ఎన్వలప్‌ను రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఏర్పాటు చేసిన సీల్ చేయబడిన పోస్టల్ డ్రాప్ బాక్స్‌లో వేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా గోప్యతతో, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి మరియు సిబ్బంది తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఇందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినదని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. నిర్ణీత తేదీల్లో అందరూ వ్యక్తిగతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :