Wednesday, 16 September 2026 06:52:40 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

యూనివర్సల్ న్యూ బోర్న్ బేబీస్ ఐ స్క్రీనింగ్ (ఆర్క్ లైట్ ఎగ్జామినేషన్) శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 06 August 2026 05:46 PM Views : 107

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నవజాత శిశువుల కంటి పరీక్షలు ప్రతి శిశువుకు తప్పనిసరిగా నిర్వహించాలి.నవజాత శిశువులలో పుట్టుకతో వచ్చే కంటి లోపాలను (నెలలోపు) ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రతి శిశువుకు జననం అనంతరం కంటి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ N-BLESS కింద నిర్వహించిన యూనివర్సల్ న్యూ బోర్న్ బేబీస్ ఐ స్క్రీనింగ్ – ఆర్క్ లైట్ ఎగ్జామినేషన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ , అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నవజాత శిశువులలో కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అంధత్వాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి శిశువుకు నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారం రాథోడ్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు ఆర్క్ లైట్ పరికరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి, అనుమానిత కేసులను వెంటనే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయాలని MLHPలు, ANMలకు సూచించారు. ఈ శిక్షణ ద్వారా ఆరోగ్య సిబ్బంది నైపుణ్యాలు మరింత మెరుగుపడి చిన్నారులకు నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు.శిక్షణలో ఆర్క్ లైట్ పరికరం వినియోగం, రెడ్ రిఫ్లెక్స్ పరీక్ష, పుట్టుకతో వచ్చే కంటి లోపాల గుర్తింపు, రిఫరల్ విధానం వంటి అంశాలపై ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు సవివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, Dr రాందాస్ ప్రోగ్రాం ఆఫీసర్, Dr దినేష్ ప్రోగ్రాం ఆఫీసర్, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, జిల్లాలోని మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (MLHPలు), ఏఎన్‌ఎంలు (ANMs) మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :