తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గోప తండా శివారు, రైల్వే ట్రాక్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై సీసీఎస్ (CCS) సిబ్బంది మరియు సుజాతనగర్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి ₹52,100 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 5 స్మార్ట్ ఫోన్లు మరియు పేకముక్కలను స్వాధీనం (సీజ్) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.పట్టుబడిన నిందితుల వివరాలు:1.నునావత్ సంతోష్.2.భూక్య బిక్కులాల్.3.నున్సావత్ అశోక్ కుమార్.4.చల్ల రాజు.5.భూక్య వీరన్న.6.ఇస్లావత్ ప్రవీణ్ కుమార్.పరారీలో ఉన్న నిందితులు:1.కున్సోత్ వంశీ.2.భూక్య ప్రవీణ్.3.పల్లపు చంటి.4.బానోత్ గోపి.5.ధరావత్ రాజ్ కుమార్. చట్టవ్యతిరేకమైన పేకాట, జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సుజాతనగర్ ఎస్సై రమాదేవి హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ