తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం సింగరేణి బిల్డింగ్ ఆఫీస్ ఎదురుగా గల గ్రౌండులో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మరియు కాపుకృష్ణ ఫైర్వర్క్స్ వారి( దీపావళి టపాకాయల దుకాణం ) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున కొత్తగూడెం ఆడపడుచులందరూ కూడా బతుకమ్మలు తీసుకొని వచ్చి బహుమతులు గెల్చుకున్నారు. మొదటగా బతుకమ్మలు తీసుకువచ్చిన ముగ్గురు మహిళలకు ఒకటి రెండు మూడు బహుమతులు ఇవ్వడం జరిగింది,అలాగే మంచిగా బతుకమ్మలు పేర్చిన మహిళలకు ఒకటి రెండు మూడు పట్టుచీర బహుమతులు ఇవ్వడం జరిగింది మంచిగా బతుకమ్మ పాటలు పాడిన మహిళలకు ఒకటి రెండు మూడు బహుమతు ఇంకొక 10 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. డాన్సులు వేస్తూ పాటలు పాడిన వారికి సీనియర్స్ కు మొదటి రెండు మూడు బహుమతులు, జూనియర్స్ కు మొదటి రెండు మూడు బహుమతులు ఇవ్వడం జరిగింది. బతుకమ్మలు తీసు కొన్నివచ్చిన వారికి 100 మందికి బహుమతులు ఇవ్వడం జరిగింది.మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కాపుకృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి( తెలంగాణ కార్మిక సంఘం) చేతుల మీదిగా ఇవ్వడం జరిగింది. వచ్చి మొదటి బహుమతి అందుకున్న ఆపాల లక్ష్మి, రెండవ బహుమతి అందుకున్న పిడుగు సత్యవతి, మూడవ బహుమతి అందుకున్న వెంపటి రమాదేవి గారు.ఈ బతుకమ్మ ఉత్సవాలలో బిఆర్ఎస్ నాయకులు తోగార రాజశేఖర్ గారు,రామిళ్ల మధు,జినీత్, నవనీత్, పెంట్రాజు, సబ్బని శ్రీనివాస్, వెంపటి రవికుమార్, షణ్ముఖ, ప్రకాష్, పవన్,వినీత్,రోషన్, సోహల్, ఉపేంద్ర, సుమ, ఈశ్వరి, కళ్యాణి,శిరీష,పట్టణ ఆడపడుచులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ