తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సోదర సోదరిమణులకు తెలియజేయునది. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వరికి బోనస్ 500రూ క్వింటాకు ఈ క్రింద పేర్కొన్న వరి రకాలకు మాత్రమే వర్తించును. (1) BPT-5204 (2) RNR-15048 (3) WGL-44 (5) (4) jai sree ram (5) HMT SONA (6) KNM-1638 (7) KNM-7715 ఈ పైన పేర్కొన్న వరి రకాలు రైతు సోదరులు కొనుగోలు డీలర్ల7 KVK'S వారి వద్ద తప్పనిసరిగా OLMS సీడ్ పోర్టల్ (ఆన్లైన్ సీడ్ పోర్టల్) నమోదు చేసుకోవలెను కొందరు రైతులు, ఇతర రైతుల వద్ద మరియు రైతు నుండి రైతు కొన్న పైన తెల్పిన వరి సన్న రకాలు కొనుగోలు చేసినట్లయితే మీ క్లస్టర్ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మండలంలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించి ఆన్లైన్ సీడ్ పోర్టల్ లో తప్పని సరిగా నమోదు చేసుకోగలరు ఈ అవకాశం 10.09.2026 తారిఖుతో ముగియనుంది. కనుక వరి సాగు చేసిన ప్రతి రైతు తప్పనిసరిగా 10.09.2025 లోపు ఆన్లైన్ సీడ్ పోర్టల్ నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భద్రాద్రి కొత్తగూడెం గారు విజ్ఞప్తి చేయుచున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ