తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రవక్త బోధనలు జగతికి మార్గదర్శకాలు.సౌభ్రాతృత్వ భావనతోనే శాంతి సౌభాగ్యాలు.మనుషులంతా ఒక్కటనేది ప్రవక్త సందేశం. అసమానతలు వీడి ఐక్యంగా ముందడుగు వేయాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.మహమ్మద్ ప్రవక్త బోధనలు జగతికి మార్గదర్శకాలని, సమసమాజ స్థాపనకు ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం 'మిలాద్ ఉన్ నబీ' పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని మసీద్ కమిటీలు, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పాతడిపో సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయీమ్ ఖురేషి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కూనంనేని పాల్గొని ప్రసంగించారు. మానవత్వ విలువల పరిరక్షణే పరమ ధర్మమని, సమస్త మానవాళి క్షేమం కోసమే ప్రవక్త జీవన గమనం సాగిందని ఆయన గుర్తుచేశారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను పారద్రోలి పరస్పర విశ్వాసంతో జీవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, మతసామరస్య పరిపుష్టికి ప్రవక్త సందేశాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ సోదరభావాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ పాల్గొనిమాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏ డబ్ల్యూ ఎస్ అధ్యక్షులు అమీర్ ఖాద్రి, మైనార్టీ నాయకులు షమ్మీద్దీన్, జాఫర్ ఖురేషి, సిరాజ్ భాయ్, హాజీ రంజాన్ ఖాన్, అన్వర్ పాషా, దస్తగిరి టీచర్, ఖాజా బాబా, తాజాద్దీన్, యకూబ్ ఖాద్రి, బాబుజని ఖాన్, అబ్దుల్లా, ఎండీ జమాల్, ఖమర్, జుబేద్ ఆలం, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ