Thursday, 17 September 2026 04:25:35 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు - తీవ్రంగా ఖండిస్తున్నాం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

Date : 08 September 2026 06:07 PM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు - తీవ్రంగా ఖండిస్తున్నాం.అసెంబ్లీలో టీ-షర్టులు విప్పి బనియన్‌తో రావడం ఏం రాజకీయ సంస్కారం?టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.TPCC పిలుపు మేరకు ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం, సుజాతనగర్ సెంటర్ నందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్రా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, అలాంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజకీయ భేదాలు ఉండవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, అయితే వ్యక్తిగత గౌరవాన్ని, స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.మీరు అసెంబ్లీలో టీ-షర్టులు విప్పి, బనియన్‌తో రావడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, జిల్లా జనరల్ సెక్రటరీ పైడా రాజేంద్రప్రసాద్, మాజీ AMC చైర్మన్ రాంబాబు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కిన్నెర వెంకన్న, సర్పంచ్ లు వజ్జా రామారావు, గుగులోతు జానికిరామ్, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ లు భద్రూ నాయక్, రాందాస్ నాయక్, AMC డైరెక్టర్ అమ్రూ నాయక్, కోటేష్ నాయక్, శ్రీనివాస రావు, నరసింహరావు, ఎట్టి భాస్కర్, భుక్య మోహన్, గాజుల సీతారామయ్య, మండే శ్రీను, లింగం లక్ష్మయ్య, చల్లా నాగేశ్వరరావు, ఓర్సు ఉపేందర్, సిద్ధల నరేందర్, నునావత్ సంతోష్, చిట్లూరి సుధీర్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :