Thursday, 17 September 2026 11:39:27 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 29 June 2026 03:22 PM Views : 195

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ములకలపల్లిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ములకలపల్లి మండలంలో పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంతో పాటు ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలకు సూచించారు. ఫారాల పంపిణీ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లే సమయంలో ప్రతి కుటుంబాన్ని తప్పనిసరిగా కలుసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయాలని, ఏ ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఓటరు జాబితా సవరణను పూర్తిస్థాయి పారదర్శకతతో, భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన ఫారాలను గడువులోపు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్‌పేషెంట్ వార్డు, ఔట్‌పేషెంట్ వార్డు, ప్రసూతి గది, రక్త పరీక్షల గది, ఫార్మసీ, ఔషధ నిల్వ కేంద్రం, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజువారీగా వచ్చే ఔట్‌పేషెంట్ల సంఖ్య, చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్ల సంఖ్య, నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా, ఔషధ నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించారు. అవసరమైన మందులు, పరీక్షా సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, వైద్య సామగ్రిని తగినంతగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, సురక్షితమైన తాగునీటి వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వాతి బిందు, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సాయి కళ్యాణ్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీకృష్ణ, మెడికల్ సిబ్బంది ఇమ్రాన్, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :