తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలి నష్టం కలిగించే శక్తి పాలసీని స్వస్తి చెప్పండి స్కిల్ వర్సిటీలో అనుసంధానాన్ని అడ్డుకుంటాం సాంకేతిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తే సహించం : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలోని రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అనుసంధానం చేయాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సాంకేతిక విద్యా రంగాన్ని బలోపేతం చేయాల్సింది పోయి, వ్యవస్థను బలహీనపరిచేలా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు శాపంగా మారే శక్తి పాలసీని రద్దు చేసి, సాంకేతిక రంగంలో మెరుగైన అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలపై అసెంబ్లీలోనూ గళమెత్తుతామని, జీవో ఉపసంహరణ వరకు పోరాటాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సలిగంటి శ్రీనివాస్, ఎస్ కే ఫహీమ్ దాదా, వర్క అజిత్, తోట రాజు, ఖయ్యుమ్, రవికిరణ్, సలిగంటి నవీన్, వాడి కనకరాజు, ముత్యాల వినయ్, జావీద్, కాశి, కొయ్యడ రవి, సృజన్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ