తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 2024-25 విద్యా సంవత్సరములో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంబెడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా అర్హులైన ఎస్సీ విద్యార్ధులకు అందిస్తున్న ఆర్ధిక సహాయం సద్వినియోగం చేసుకోవాలని శ్రీమతి డి. అనసూర్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారు తెలియచేయనైనది. అంబెడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పధకం ద్వారా క్రింద పేర్కొన్న (10) దేశాలకు వెళ్లవచ్చు: 1) USA 2) Canada 3) Germany 4) France 5) UK 6) Singapore 7) Japan 8) South Korea 9) Australia 10) New Zealand. కావలసిన అర్హతలు:- 1. కుటుంబ వార్షిక ఆదాయము (తల్లిదండ్రుల మరియు ధరఖాస్తుదారు యొక్క) రూ.5,00,000/-లకు మించరాదు. 2. కుటుంబములో ఒక విద్యార్ధి మాత్రమే ఈ పథకము క్రింద అర్హులు. 3. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు :- ఫౌండేషన్ డిగ్రీ ఇంజనీరింగ్ / మేనేజ్మెంట్ / ప్యూర్ సైన్సెస్ / అగ్రికల్చర్ సైన్సెస్ / మెడిసిన్ మరియు నర్సింగ్ / సోషల్ సైన్సెస్ / హ్యుమానిటీస్ కోర్స్ లలో ఉతీర్ణత శాతం 60% ఉండాలి. 4. పి.హెచ్.డి కొరకు :- పి.జి. ఇంజనీరింగ్ / మేనేజ్మెంట్ / ప్యూర్ సైన్సెస్ / అగ్రికల్చర్ సైన్సెస్ / మెడిసిన్ మరియు నర్సింగ్ / సోషల్ సైన్సెస్ / హ్యుమానిటీస్ కోర్స్ లలో ఉత్తీర్ణత శాతం 60% ఉండాలి. 5. విద్యార్థిని, విద్యార్థులు ఏదేని TOFEL, IELTS, GRE, GMAT, PTE లలో అర్హత సాధించి ఉండాలి. 6. విద్యార్థిని, విద్యార్ధులు అర్హత కలిగిన విదేశాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అడ్మిషన్ పొంది ఉండాలి. 7. విద్యార్థిని, విద్యార్ధులు తగిన పాస్ పోర్ట్ పొంది ఉండాలి. 8. విద్యార్థిని, విద్యార్ధులు వయస్సు 35 సంవత్సరములు మించరాదు. విద్యార్థిని, విద్యార్థులు వెబ్ సైట్ https://telanganaepass.cgg.gov.in లో ధరఖాస్తు చేసుకోవాలి, అట్టి ధరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేది: 19.05.2025. ఆన్ లైన్ చేసుకున్న దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధిశాఖ అధికారి వారి కార్యాలయము (IDOC), రూమ్ నెం. S-27, సెకండ్ ఫ్లోర్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం నందు సమర్పించవలయును.
Admin
తెలుగు వెలుగు టీవీ