Thursday, 17 September 2026 12:50:29 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 25 September 2025 04:54 PM Views : 346

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి పౌరుడు నిరంతరం ఆచరించాల్సిన బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. పరిశుభ్రతా కార్యక్రమాలు సమాజంలో నిత్యకృత్యంగా కొనసాగితేనే ఆరోగ్యవంతమైన, శుభ్రమైన, పచ్చదనంతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని ఆయన పౌరులకు పిలుపునిచ్చారు. భారత ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఆవరణలో గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రతను కాపాడే దిశగా అందరూ కలసికట్టుగా శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇంటి నుండి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి వద్దే చెత్తను వేరు వేరు డబ్బాలలో వేసి సక్రమంగా పారవేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు అని అన్నారు. మురుగు కాలువల్లో చెత్త పడితే నీటి ప్రవాహం ఆగిపోతుంది, దాంతో దోమల పెరుగుదల, పలు రకాల వ్యాధుల వ్యాప్తి జరుగుతుంది కాబట్టి ఈ విషయంపై ప్రతి పౌరుడూ జాగ్రత్తగా ఉండాలి అని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతేనని, సమాజం పరిశుభ్రంగా ఉండేలా అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులతో పాటు విద్యార్థులు, యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే భవిష్యత్ తరాలకు పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన సమాజాన్ని అందించగలమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛతకు కట్టుబడి ప్రతిజ్ఞ చేసి, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కట్టుబడి ముందడుగు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఏడి మైన్స్ దినేష్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏడి రమేష్, మెప్మా పీడీ రాజేష్ మరియు జిల్లా ఉద్యోగులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :