Saturday, 19 September 2026 06:50:41 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

వాల్ క్యాలెండర్ల ఉచిత పంపిణీ అభినందనీయం : ఏ.ఐ.ఎల్.యు. కృషిని ప్రశంసించిన జిల్లా జడ్జి.

Date : 31 December 2024 07:42 PM Views : 819

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రతి ఏడాది ప్రచురిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఆరు పేజీల 2025 సంవత్సరపు క్యాలెండర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ పాటిల్ వసంత్ గారు మంగళవారం బార్ అసోసియేషన్ లైబ్రరీ హాలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ పని ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో ఏ.ఐ.ఎల్.యు. క్యాలెండర్ ఉపయోగ పడుతుందని, వాల్ క్యాలెండర్లు ముద్రించి, న్యాయవాదులకు ఉచితంగా పంపిణీ చేయటం అభినందనీయమని ఏ.ఐ.ఎల్.యు. కృషిని ప్రశంసించారు. ఈ వాల్ క్యాలెండర్ లో కోర్టు పనిదినాల వివరాలతో పాటు, తెలుగు తిధులు, ఇతర పండగల వివరాలతో, కుటుంబం మొత్తానికి పనికి వచ్చే విధంగా ఉన్నదన్నారు. తొలుత ఏ.ఐ.ఎల్.యు. కోర్టు కమిటీ అధ్యక్షులు కె. పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా జడ్జి ప్రసంగించారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు, ఏ.ఐ.ఎల్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణకు ఏ.ఐ.ఎల్.యు. కట్టుబడి ఉందని, కక్షిదారుల చెంతకు కోర్టులను తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు బి. రామారావు, ఏ.సుచరిత, బార్ అధ్యక్షుడు ఎల్.సత్యనారాయణ పాల్గొనగా, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్ స్వాగతం పలికారు. అనంతరం వాల్ క్యాలెండర్ ను జిల్లా జడ్జి అవిష్కరించగా, ప్యాకెట్ క్యాలెండర్ ను కొల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎల్.యు. జిల్లా బాధ్యులు జె.శివరాం ప్రసాద్, పి. కిషన్ రావు, రావిలాల రామారావు, జి.కె. అన్నపూర్ణ, జి. సునంద, అరికాల రవి కుమార్, ఉప్పు అరుణ్, తెల్లబోయిన రమేష్, పిట్టల రామారావు, శ్రీరాముల రవి, బార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు తోట మల్లేశ్వర్ రావు, ఎస్.ప్రవీణ్ కుమార్, దూదిపాల రవి కుమార్, సాదిక్ పాషా, నల్లమల ప్రతిభ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి.వి.డి. లక్ష్మీ, లావణ్య, విశ్వ శాంతి సీనియర్ న్యాయవాదులు ఉదయ భాస్కర్ రావు, వై. బాబురావు, వి.వి.సుధాకర్ రావు, వి. నాగిరెడ్డి, ఆర్. విజయ్ కుమార్, పి.గణేష్ బాబు, ఏ. రాం ప్రసాద్, జి. రామచంద్రా రెడ్డి, జె. పద్మనాభ రావు, వెల్లంకి వెంకటేశ్వర రావు, భాగం మాధవ రావు, డి. రమేష్, ఎస్. విజయ భాస్కర్ రెడ్డి, ఎల్.వి. దుర్గ రావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :