Wednesday, 16 September 2026 06:04:58 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

Date : 23 October 2025 06:04 PM Views : 338

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. బోడు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. బోడు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ముందుగా ఇల్లందు డిఎస్పీ చంద్రభాను పుష్పగుచ్చం అందించి జిల్లా ఎస్పీకి స్వాగతం పలికారు.అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.బోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది యొక్క ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను ఎస్పీ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్లో వర్టికల్స్ వారీగా విధులు నిర్వర్తించే సిబ్బందిని ఒక్కొక్కరిగా వారి పనితీరు గురించి పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,టేకులపల్లి సీఐ సత్యనారాయణ,ఎస్సై శ్రీనివాసరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :