Friday, 18 September 2026 08:05:46 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు.... జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 09 February 2026 09:45 PM Views : 197

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మునిసిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.మునిసిపల్ ఎన్నికలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఐ డి ఓ సి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన , సాధారణ ఎన్నికల పరిశీలకులు అమోయ్ కుమార్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి లతో కలిసి పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఇల్లందు మున్సిపాలిటీ అశ్వరావుపేట మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో మూడవ ర్యాండమైజేషన్ పూర్తిచేసి పోలింగ్ బృందాలను ఫైనల్ చేసామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశామని, అక్కడ పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ అందించామని, కౌంటింగ్ హాల్స్ నందు అవసరమైన ఏర్పాట్లు కల్పించామని కలెక్టర్ తెలిపారు.100 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విజయవంతంగా పూర్తి చేసామని, పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బందికి అవసరమైన టిఏ, డిఏ ల చెల్లింపులు జరిపేలా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇంచార్జి అధికారి ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించా మన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :