తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1తెలుగు వెలుగు)జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామపంచాయతీ లో రైతు జర్పుల కృష్ణ తన పంట పొలంలో లో పండించిన మొక్క జొన్న కంకులు 30 .03.2025 నా తినడం వలన చనిపోయాడు. అట్టి విషయం పత్రికలలో మరుసటి రోజు రావడం తో వెంటనే అప్రమత్తం అయిన జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు మరియు మండల వ్యవసాయ అధికారి గడ్డం దీపక్ ఆనంద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలను కలిసి విచారణ జరిపినారు సదరు రైతు ఒక విత్తన కంపెనీ కి సంబందించిన విత్తనాలను పండించినాడు వారి కుటుంబ సభ్యులు ల సమాచారం మేరకు సదరు రైతు ఆ మొక్క జొన్న కంకులు గత వారం రోజులుగా తినడం వలన తన యొక్క ఆరోగ్యం క్షినించింది 29.03.2025 తీవ్ర వొళ్ళు నొప్పులతో బాధపడి 30.03.2025 నా చనిపోవడం జరిగింది అని తెలిపినారు విత్తన కంపెనీ ప్రతి నిధులతో జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడి బాధిత కుటుంబా నికి న్యాయం జరిగే ల చూడాలి అని విత్తన కంపెనీ ప్రతనిధులు కి చెప్పడం జరిగినది అగ్రిమెంట్ పత్రాలు తమకి ఇవ్వలేదు అని అట్టి విత్తనాల కంపెనీ అదే మండలం లో సుమారు 100 ఏకరాలు లో సాగు చేస్తున్నారు అని రైతులు తెలపడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వేల్పుల బాబు రావు మరియు ఖమ్మం జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ శ్రీ నల్లమల వెంకటేశ్వర రావు బాధిత రైతు కుటుంబాన్ని కలిసి వారిని పరమర్శించారు. వివరాలు తెలుసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపినారు
Admin
తెలుగు వెలుగు టీవీ