Monday, 03 August 2026 10:59:55 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Date : 02 June 2026 12:25 PM Views : 73

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సాయుధ, స్వరాష్ట్ర పోరాటాలలో కమ్యూనిస్టుల పాత్ర అనన్యం అమరవీరుల త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వీరోచిత పోరాటాల చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర చిరస్మరణీయం అమరుల ఆశయ సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం ప్రజా సంక్షేమం, హక్కుల రక్షణ కోసమే సిపిఐ నిరంతర పోరాటాలు : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలంగాణ సాయుధ, స్వరాష్ట్ర పోరాటాలలో కమ్యూనిస్టుల పాత్ర అనన్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాబీర్ పాషా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జరిగిన సదస్సులో తెలంగాణ సాయుధ పోరాటంలో, స్వరాష్ట్ర సాధన పోరాటంలో మృతిచెందిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాడు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమరవీరుల త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని, మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర చిరస్మరణీయమని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల గొంతుకగా నిలిచామని గుర్తుచేశారు. అమరుల ఆశయ సాధన కోసం ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రజా సంక్షేమం, హక్కుల రక్షణ కోసమే సిపిఐ నిరంతర పోరాటాలు సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాస రావు, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు కొమారి హన్మంతరావు, నేరెళ్ల రమేష్, కె రత్నకుమారి, మునిగడప పద్మ, మునిగడప వెంకటేశ్వర్లు, జక్కుల రాములు, నాయకులు, కార్పొరేటర్లు ఎండి యూసుఫ్, షాహీన్, ధనలక్ష్మి, శాంతిప్రియ, ఎమ్ హరిత,నామా కీర్తి, పడాల ఆకాంక్ష, అన్నపూర్థ, శ్యామల, బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, దాసరి శ్రీనివాస్, కూరపాటి సుధాకర్, దుర్గ, సత్యనారాయణాచారి, గడ్డం ప్రభాకర్, కైసర్, రాకేష్, ఖయూమ్, జహీర్, సతీష్, భవాని ప్రసాద్, భూక్యా శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో : కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తొలిదశ, మలిదశ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో, సాయుధ పోరాటంలోనూ కమ్యూనిస్టుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ప్రజల సంక్షేమ, అభివృధ్ధికోసం స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చేస్తున్న కృషికి ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :