Friday, 18 September 2026 11:58:10 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 05 June 2026 08:37 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల అమలు, ఉపాధి కల్పన కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన సలహాలు, సహాయ సహకారాలు అందించి కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించాలని అన్నారు. పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి కోసం వైటీసీ, పాలిటెక్నిక్ మరియు ఇతర సాంకేతిక విద్యా కోర్సులపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నూతన కోర్సుల వివరాలతో కూడిన కరపత్రాలను అందుబాటులో ఉంచి విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో భాగంగా టీజీఐపాస్ (TG-iPASS) ద్వారా పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. మొత్తం 50 దరఖాస్తులు అందగా, వాటిలో 39 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఒక దరఖాస్తు తిరస్కరించగా, మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సేవా రంగ సంస్థలకు పెట్టుబడి రాయితీ పథకం అమలు, దరఖాస్తుల స్థితిగతులపై కూడా చర్చించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) స్థాపనకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. క్లస్టర్ అభివృద్ధి, స్థానిక వనరుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగ మేళాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.పరిశ్రమల సంఖ్యను పెంచి జిల్లాను పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు.సమావేశంలో డేవిడ్ రాజు ఏపీఓ జనరల్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఎల్ డి ఎం రామిరెడ్డి, మెప్మా పీడీ రాజేష్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంగామ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :